శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
గీతార్థ సంగ్రహం లోని 21వ శ్లోకం లో, ఆళవందార్లు పదిహేడవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పదహేడవ అధ్యాయం లో, శాస్త్ర విధితం కాని కర్మలు అన్ని అసురులకు(క్రూరమైన వారికి) (కావున పనికిరానివి), శాస్త్ర విదితమైనవి త్రిగుణాత్మకమైనవి (సత్త్వ, రజస్, తమస్) కావున మూడు వేరు విధానాలు కలిగి ఉంటాయి అని. శాస్త్ర విదితమైన కర్మలు యజ్ఞం ఇత్యాదులు, “ఓం తత్ సత్” అనే పదాలు (ఇవి కలిసి, ఇతర కార్యాల నుండి వేరు చేస్తాయి) మరియు వాటిని (ఇటువంటి కర్మలు)ను గుర్తిస్తాయి అని వివరించబడింది”.
ముఖ్యమైన శ్లోకాలు
శ్లోకం 1
అర్జున ఉవాచ యే శస్త్రవిధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః । తేశామ్ నిష్ఠ తు కా కృష్ణ సత్వం అహో రజస్ తమః ॥
ఓ కృష్ణ! శాస్త్ర నియమాలు పాటించకుండా విశ్వాసం తో చేసే యజ్ఞం ఏ స్థితి గా పరిగణించ బడుతుంది ? సత్త్వ గుణమా, రజో గుణమా లేదా తమో గుణమా?
2వ శ్లోకం నుండి 4వ శ్లోకం వరకు, కృష్ణుడు వివరిస్తూ ధర్మ విదితమైన కార్యాలు సంబంధించి మనిషి విశ్వాసం సాత్విక మైనా, రాజసికమైనా, తామసికమైన అయ్యుండొచ్చు అని వివరిస్తున్నాడు.
శ్లోకం 4
యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షామ్సి రాజసాః । ప్రేతన్ భూతగణాంశ్చ అన్యే యజంతే తామసా జనాః ॥
సత్వగుణం ప్రధానం గా ఉన్నవారు, మరియు ఆ పద్ధతి పైన నమ్మకం ఉన్నవారు, దేవతలను ఆరాధిస్తారు; రాజో గుణం ప్రధానమైన వారు మరియు ఆ పద్ధతి పైన నమ్మకం ఉన్నవారు, యక్షులు(భూతాలు) మరియు రాక్షసులను ఆరాధిస్తారు; మిగిలిన వారు తమో గుణం ప్రధానమైన వారు ఆ పద్ధతి పైన నమ్మకం కలవారు చనిపోయిన వారిని(పితృ దేవతల్ని) మరియు దయ్యాలని ఆరాధిస్తారు.
5వ శ్లోకం మరియు 6వ శ్లోకం లో, తను శాస్త్ర నిర్దేశించబడని కర్మలు పూర్తి విశ్వాసం తో చేసినా నిరర్థకం అలాగే వినాశకర ఫలితాలు ఇస్తాయి అని వివరిస్తున్నారు..
శ్లోకం 7
ఆహారస్ త్వాపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః । యజ్ఞాస్ తపస్ తథా దానం తేశామ్ బేధం ఇమం శృణు ॥
అన్ని జీవులకు, ఆహారం కూడా గుణాల అధారం గానే ప్రియం అవుతుంది; యజ్ఞాలు, తపస్సులు మరియు దానధర్మాలు కూడా అంతే; ఆహారం, యజ్ఞాలు, తపస్సులు మరియు దానధర్మాలలో (సత్వ గుణాల ఆధారంగా) వ్యత్యాసాలను (నా నుండి) విను.
8,9,10వ శ్లోకాల్లో, సత్వ, రజస్ మరియు తమస్ స్వభావం గల ఆహార పదార్థాలు వివరించారు. సత్వగుణం ప్రధానం మైనా ఆహారం శాశ్వత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది, రజో గుణం ప్రధానమైన ఆహారం దుఃఖం, అనారోగ్యం మరియు శోకం ప్రసాదిస్తాయి మరియు తమో గుణం శాశ్వత బంధం/బాధ ప్రసాదిస్తాయి.
11,12,13వ శ్లోకాల్లో, సత్వాది గుణాలలో చేసిన యజ్ఞం గురించి వివరించబడ్డాయి, సాత్విక యజ్ఞం శాస్త్ర విధముగా ఎటువంటి కోరిక లేక, భగవత్ ఆరాధన గా చెయ్యబడుతుంది; రాజస యజ్ఞం ప్రత్యేకమైన కోరిక తో, ఖ్యాతి కాంక్ష తో చెయ్యబడుతుంది; తామస యజ్ఞం బ్రాహ్మణ మార్గదర్శం లేకుండా అధర్మమైన ధనం తో సరైన మంత్రం, దక్షిణ, విశ్వాసం మూడు లేకుండా చెయ్యబడుతుంది.
14వ శ్లోకం మొదలు 19వ శ్లోకం వరకు తపస్సు గురించి విస్తారం గా వివరించబడింది. అందులో, శ్లోకం 14 నుండి 16 వరకు కాయిక(శరీరం), వాచిక(మాట ద్వారా) మరియు మానసిక తపస్సు గురించి, శ్లోకం 17 నుండి 19వ శ్లోకం వరకు సత్వాది గుణాల ప్రధానం గా చెయ్య బడే తపస్సు గురించి వివరించారు.
20వ శ్లోకం మొదలు 22వ శ్లోకం వరకు సత్వాది గుణ ప్రధానం గా చేసే దానాల గురించి వివరించారు.
శ్లోకం 23
ఓం తత్ సద్ ఇతి నిర్ధేశో బ్రహ్మణస్ త్రివిధః స్మృతః । బ్రాహ్మణాస్ తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ॥
“ఓం తత్ సత్” అను మూడు పదాలు వైదిక కర్మలకు ప్రయోగించబడేవి. ఆ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) వేదం నేర్చుకునేందుకు యోగ్యులు మరియు ఈ మూడు పదాల తో కూడిన వారు, వేదాలు మరియు యజ్ఞాలు, సృష్టి చేసేప్పుడు, నాచే సృజించబడ్డాయి.
వివరణం : తర్వాత 4 శ్లోకాల్లో, ఈ శ్లోకం లో చెప్పిన విషయాన్ని విస్తారం గా వివరించి బడింది.
24వ శ్లోకం లో, అన్ని వైదిక కర్మలు చేసేప్పుడు ప్రణవం చెప్పి మాత్రమే ఆరంభించాలి అని వివరించ బడింది.
25వ శ్లోకం లో, త్రివర్ణికులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) ఎవరు అయితే మోక్షం ఆర్జిస్తారో వారు యజ్ఞం తపస్, మరియు దానాలు “తత్’ అని అనుసందిస్తూ ఎటువంటి కోరికలు లేకుండా చెయ్యాలి అని వివరించారు.
26వ శ్లోకం లో, అన్ని సత్కార్యాలు (మంచి పనులు) “సత్” అని అనుసందించి చెయ్యాలి అని, తర్వాత శ్లోకం లో కూడా “సత్ యొక్క ప్రాధాన్యత వివరించారు
శ్లోకం 28
అశ్రద్ధయా హుతం దత్తం తపస్ తప్తం కృతం చ యత్ । అసాధిత్యుచ్యతే పార్థ న చ తత్ ప్రేత్య నో ఇహ ॥
ఓ కుంతీ పుత్రుడా! విశ్వాసం లేని హోమం (యజ్ఞం), దానం మరియు తపస్సు కు పేరు “అసత్” ఇది మోక్షం ఇవ్వదు లేదా ఎటువంటి సంసారిక లాభం చేకూర్చదు.
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
మూలము : https://githa.koyil.org/index.php/essence-17/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org