శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకం
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||
ప్రతి పదార్థం
భవాన్ – తాము (గురుదేవులైన ద్రోణాచార్యులు)
భీష్మః చ (భీష్మశ్చ) – మరియు పితామహ భీష్ముడు
కర్ణః చ (కర్ణశ్చ) – మరియు అంగరాజు అయిన కర్ణుడు
సమితింజయః కృపః చ (సమితింజయః కృపశ్చ) – యుద్ధరంగమున సదా విజయాన్ని వరించే కృపాచార్యుల వారు
అశ్వత్థామా – మీ కుమారుడైన అశ్వత్థామ
వికర్ణః చ (వికర్ణశ్చ) – మరియు తమ్ముడైన వికర్ణుడు
సౌమదత్తిః (సౌమదత్తి) – సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు
తాత్పర్యం:
గురుదేవులైన తాము (ద్రోణాచార్యులు), పితామహ భీష్ముడు, కర్ణుడు, యుద్ధరంగంలో సదా విజయాన్ని వరించే కృపాచార్యుల వారు, మీ కుమారుడైన అశ్వత్థామ, నా సోదరుడైన వికర్ణుడు మరియు సోమదత్త పుత్రుడైన భూరిశ్రవుడు – వీరందరూ ఇక్కడ (మన పక్షాన) కొలువై ఉన్నారు.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org