శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకం
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥
ప్రతి పదార్థం
యుధామన్యుః – యుధామన్యుడు
విక్రాంతః – విజేత / పరాక్రమశాలి
వీర్యవాన్ – సౌర్యవంతుడు/ మహా బలశాలి
ఉత్తమౌజాః చ – ఉత్తమౌజస్సు అనే రాజు
సౌభద్రః – సుభద్రా నందనుడైన అభిమన్యుడు
ద్రౌపదేయః – ద్రౌపది పుత్రులు అయిన ఐదుగురు ఉపపాండవులు
ఏవ – వీరందరూ/వీరంతా
మహారథాః – మహారథులు
తాత్పర్యం
విజేతయైన యుధామన్యుడు, శౌర్యవంతుడైన ఉత్తమౌజస్సు అనే రాజు, సుభద్రా నందనుడైన అభిమన్యుడు మరియు ఉప పాండవులుగా పిలవబడే ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు – వీరందరూ మహారథులే.
శ్రీ తేజ రామానుజ దాసి
ఆముక్త రామానుజ దాసి
మూలం – https://githa.koyil.org/index.php/1-6/
పొందుపరచిన స్థానము- https://githa.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org