1.18 ద్రుపదో ద్రౌపదేయాశ్చ

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 17

శ్లోకం

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వతః పృథివీపతే |

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||

ప్రతి పదార్థం

పృథివీపతే  – ఓ భూపాలా / ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!)

ద్రుపదో  – ద్రుపద రాజు (పాంచాల దేశ రాజు)

ద్రౌపదేయాః చ – మరియు ద్రౌపది యొక్క కుమారులు

మహాబాహుః – గొప్ప బాహువులు (పొడవైన చేతులు) కలవాడు

సౌభద్రః  – సుభద్ర కుమారుడైన అభిమన్యుడు

సర్వతః  – అన్ని వైపులా / అన్ని దిక్కులా

పృథక్ పృథక్ – అంటే విడివిడిగా / ఎవరికి వారే

శంఖాన్ – తమ తమ శంఖములను

దధ్ముః – పూరించిరి / ఊదిరి

తాత్పర్యం

ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాంచాల రాజు (ద్రుపదుడు), ద్రౌపది కుమారులు మరియు పొడవైన (బలమైన) చేతులు కలిగిన సుభద్ర కుమారుడు (అభిమన్యుడు) అందరూ విడివిడిగా తమ తమ శంఖాలను పూరించారు.

ఆముక్త రామానుజ దాసి

శ్రీ తేజ రామానుజ దాసి

>> అధ్యాయం 1 శ్లోకం 19

మూలము : https://githa.koyil.org/index.php/1-18/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org