1.31 – నిమిత్తాని చ పశ్యామి

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.30

శ్లోకం

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |

న చ శ్రేయోऽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||

ప్రతి పదార్థం

కేశవ – ఓ కేశవా! (శ్రీకృష్ణా!)

విపరీతాని నిమిత్తాని చ – కీడును సూచించే అనేక అపశకునాలను (దుశ్శకునాలను)

పశ్యామి – నేను చూస్తున్నాను

ఆహవే – ఈ యుద్ధభూమిలో

స్వజనం – నా స్వజనులను (నా సొంత బంధువులను)

హత్వా – చంపి

శ్రేయః – ఎలాంటి మేలు లేదా ప్రయోజనము

న చ అనుపశ్యామి – నాకు కనిపించడం లేదు (ఊహించలేకపోతున్నాను)

తాత్పర్యం

“ఓ కేశవా! (కేశవ అనే దివ్యనామానికి అర్థం – ఎవరికైతే అందంగా వేలాడే జుట్టు ఉంటుందో, ఎవరైతే కేశి అనే అసురుడిని వధించారో, ఎవరైతే మన కష్టాలన్నింటినీ నాశనం చేస్తారో, ఎవరైతే బ్రహ్మ మరియు రుద్రులను సైతం సృష్టించారో ఆ పరమాత్ముడు)! నేను కీడును సూచించే అనేక అపశకునాలను చూస్తున్నాను; ఈ యుద్ధభూమిలో నా స్వజనులను (నా సొంత ప్రజలను) చంపి వేయడం ద్వారా నాకు ఎలాంటి లాభం (మేలు) కనిపించడం లేదు.”

అడియేన్ ఆముక్త రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 32

మూలము : https://githa.koyil.org/index.php/1-31

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org