శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
గాణ్డీవం స్రంసతే హస్తాత్ త్వక్ చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ॥
ప్రతి పదార్థం
హస్తాత్ – చేతి నుండి
గాణ్డీవమ్ – గాండీవ ధనుస్సు
స్రంసతే – జారిపోవుచున్నది
త్వక్ చ ఏవ – నా చర్మము కూడా
పరిదహ్యతే – మండిపోవుచున్నది (తాపము చెందుచున్నది)
అవస్థాతుమ్ – నిలబడుటకు
న చ శక్నోమి – నేను సమర్థుడను కావడం లేదు (నిలబడలేకపోతున్నాను)
మే మనః చ – మరియు నా మనస్సు
భ్రమతి ఇవ – తిరుగుచున్నట్లుగా (భ్రమించినట్లుగా) ఉన్నది
తాత్పర్యం
నా గాండీవ ధనుస్సు నా చేతి నుండి జారిపోతోంది, నా శరీరం కూడా పూర్తిగా మండిపోతోంది, స్థిరంగా నిలబడటం కూడా అసాధ్యంగా అనిపిస్తోంది; మరియు నా మనస్సు కూడా భ్రమించిపోయి తిరుగుతోంది.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి.
మూలము : https://githa.koyil.org/index.php/1-31
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org