శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వతః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||
ప్రతి పదార్థం
పృథివీపతే – ఓ భూపాలా / ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!)
ద్రుపదో – ద్రుపద రాజు (పాంచాల దేశ రాజు)
ద్రౌపదేయాః చ – మరియు ద్రౌపది యొక్క కుమారులు
మహాబాహుః – గొప్ప బాహువులు (పొడవైన చేతులు) కలవాడు
సౌభద్రః – సుభద్ర కుమారుడైన అభిమన్యుడు
సర్వతః – అన్ని వైపులా / అన్ని దిక్కులా
పృథక్ పృథక్ – అంటే విడివిడిగా / ఎవరికి వారే
శంఖాన్ – తమ తమ శంఖములను
దధ్ముః – పూరించిరి / ఊదిరి
తాత్పర్యం
ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాంచాల రాజు (ద్రుపదుడు), ద్రౌపది కుమారులు మరియు పొడవైన (బలమైన) చేతులు కలిగిన సుభద్ర కుమారుడు (అభిమన్యుడు) అందరూ విడివిడిగా తమ తమ శంఖాలను పూరించారు.
ఆముక్త రామానుజ దాసి
శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-18/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org