శ్రీ భగవద్ గీతా సారం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

భగవద్గీతా, మన ఇతిహాసాల లో ముఖ్యమైనదీ అయిన మహాభారతం లోని అంతర్భాగం గా మనకు అందించబడింది. ఈ భూమండలంపై దుష్ట శక్తుల భారం పెరిగినప్పుడు, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ కృష్ణుడిగా ద్వాపర యుగ సమాప్తం లో అవతరించి శిష్ట రక్షణ(మంచి వారిని రక్షించి), దుష్ట శిక్షణ(చెడు ని నిర్మూలించి) చేసి, ధర్మాన్ని స్థాపించారు. ఈ భగవద్గీతకే గీతోపనిషద్ అని పేరు, అందుకు కారణం ఈ గీతాశాస్త్రం లో అన్ని ఉపనిషత్తుల సారం ఉండటమే.

దీనికి ప్రమాణం మనకు సుపరిచితమైన ఈ శ్లోకం :

సర్వోపనిషధో గావః దోగ్ధా గోపాలనందనః ।
పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్దం గీతామృతం జగత్ ॥

ఉపనిషత్తులు అన్ని ఆవులు గా, పాలని తీసేవాడు స్వయం గా గోపాలుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ, అర్జునుడు అనే దూడ ద్వార అందించిన ఈ మధురమైన గీత అనే పాలు స్వీకరించిన వారు జ్ఞానులు.

మన ఆழ்వార్లు కూడా ఆ కృష్ణ పరమాత్మ స్వయం గా పలికిన భగవద్గీతని ఎంతో గొప్పగా కీర్తించారు. ప్రధానం గా వారు చెప్పినది మనుష్య జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు ఉజ్జీవించటానికి భగవద్గీత ని చదివి అర్థం చేసుకోవాలి అని. శ్రీ కృష్ణ చరమ శ్లోకాన్ని మనకి అందించినందుకు గాను శ్రీ వైష్ణవులకి భగవద్గీతా ఎంతో ప్రధానం.

భగవద్ గీతా 18వ అధ్యాయం 66వ శ్లోకం :

సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకం శరణం వ్రజ । అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥

(అన్ని మార్గాలని పూర్తిగా విడిచి పెట్టి, నన్ను మాత్రమే శరణువేడు, నీ సమస్త పాపాలు నుండి విడువరుస్తాను, చింతించకు).

ఈ చరమ శ్లోకాన్ని శ్రీవైష్ణవులుకు జరిపే పంచ సంస్కారం లో రహస్యమంత్రం గా ఆచార్యులు ఉపదేశిస్తారు, మరయు శ్రీ వైష్ణవులు అనుసారించాల్సిన ముఖ్యమైన శాస్త్రం.

  • తిరువాయిమోழி (4.8.6) లో నమ్మాழ்వర్లు చెప్తూ “అఱివినాల్ కుఱైవిల్లా అగల్ ఞాలత్తవర్ అఱియ నెఱియెల్లాం ఎడుత్తురైత్త నిఱై జ్ఞానత్తోరు మూర్తి” (ఈ సంసారంలో ఉన్న వారు ఎవరైతే వారు జ్ఞానహీనులు అని తెలుసుకోలేరో, వారికి సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుడు వివిధ మార్గాలని క్లుప్తంగా తెలిపాడు.)
  • నాన్ముగన్ తిరువందది(71) లో తిరుమழிసై అழ்వార్లు “సేయన్ అనియన్ సిఱియన్ మిగ ప్పెరియన్ అయన్ తువరిక్కోనాయ్ నిన్ఱ మాయన్ అన్ఱ ఓదియ వక్కతనై కల్లార్ ఉలగత్తిల్ ఏతిలరాయ్ మేయ్ ఞానమిల్” (ఆ శ్రీమన్నారాయణుడు, ఏక కాలం లో చేరుటకు అసాధ్యుడు అటులనే సులభంగా చేరటానికి సాధ్యుడు, చిన్న వాడు అదే సమయానికి చాలా గొప్పవాడు, ఆయన చిన్న గోప బాలకుడి ల అవతరించాడు అదే సమయానికి ద్వారక పట్టణానికి రాజు అయ్యాడు, అటువంటి స్వామి మహాభారత యుద్ధం లో గీతని ఉపదేశించారు. ఎవరు అయితే ఈ లోకవాసులు గా ఇంతటి అద్భుతకృతి ని నేర్చుకోరో వారు భగవాన్ కి అజ్ఞాన శత్రువులు అవుతారు.

మన ఆచార్యులు కూడా ఈ భగవద్ గీతా చదవటం అనివార్యం గా నిర్ధారించారు. భగవద్ రామానుజుల వారు ఒక్క అద్భుతమైన గీతా భాష్యాన్ని అనుగ్రహించారు. వేదాంతాచార్యుల వారు ఈ భాష్యాన్ని వారి భాష్యం అయిన “తాత్పర్య చంద్రికా” ద్వారా ఇంకా విస్తరించారు.

శ్రీవైకుంఠవాసులు అయిన పుత్తూరు కృష్ణస్వామి ఐయంగార్, గీతా భాష్యం మరయు తాత్పర్యచంద్రిక ఆధారంగా తమిழ் లో వ్యాఖ్యానం వ్రాసారు. ఆయన భగవద్గీతా లోని ప్రతీశ్లోకానికి ప్రతిపదార్థం కూడా అందించారు. ఈ తమిழ వ్యాఖ్యానం ఆధారం గా సారథీ తోతాద్రి స్వామి ఆంగ్ల అనువాదం అందించారు, మేము ఈ ప్రతిపదార్థాన్ని మరయు సరళ అనువాదాన్ని వారి ఆంగ్ల అనువాదం ఆధారం గా కూర్చాము. మేము చేసిన ఈ ప్రయత్నం భాగవతులు అందరికీ ప్రీతిని కలిగిస్తుంది అని ఆశిస్తున్నాము.

అడియెన్ ఆకాశ్ రామానుజ దాసన్.

మూలము : https://githa.koyil.org/index.php/preface/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org