శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 16 (దైవాసుర సంపత్ విభాగ యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 15

గీతార్థ సంగ్రహం లోని 20వ శ్లోకం లో, ఆళవందార్లు పదహారవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ,పదహారవ అధ్యాయంలో – (మానవులలో) దేవ (సాధువు) మరియు అసుర (క్రూరమైన) వర్గీకరణను వివరించిన తర్వాత ,(సాధించవలసిన) సత్యమైన జ్ఞానాన్ని మరియు (లక్ష్యాన్ని సాధించే) ప్రక్రియ యొక్క సాధనను స్థాపించడానికి, (మానవులు) శాస్త్రంతో బంధించబడ్డారనే సత్యాన్ని చెప్పబడింది”.

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః । దానం ధమశ్చ యజ్ఞాశ్చ స్వాధ్యాయస్ తప ఆర్జవం ॥

నిర్భయత్వం, మానసిక శుద్ధి, ఆత్మ పై ధ్యానం (భౌతిక పదార్థాం నుండి వ్యత్యాసమైనది), ధార్మికం గా సంపాదించిన ధనంతో దానధర్మాలు చెయ్యటం, ఇంద్రియ సుఖాల నుండి మనసు నిగ్రహించుకోవటం, పంచ మహా యజ్ఞాలు చెయ్యటం ఇత్యాది (నిష్కామం గా భగవత్ తిరువారాధనం), వేద అధ్యయనం, తపస్సు చెయ్యటం (ఏకాదశి వ్రతం మొదలు అయినవి) మరియు మనసు, వాక్కు, చేతలలో సామరస్యంతో ఉండటం………

వివరణం : మొదటి 3 శ్లోకాల్లో, దైవిక స్వభావం కలిగిన వారి గుణాలు వివరించబడ్డాయి.

శ్లోకం 2

అహింసా సత్యం ఆక్రోధస్ త్యాగః శాంతిర్ అపైశునం । దయ భూతేశ్వలోలుప్త్వం మార్దవం హ్రీర్ అచాపలం ॥

……..అహింస, అన్ని ప్రాణులకు మంచి చేకూర్చే సత్య వాక్యాలు పలకటం, కోపం లేకుండుట(ఇతరులకు కష్టం కలిగించే), (తనకు మంచి చెయ్యని అంశాలు) విడిచిపెట్టటం, ఇంద్రియ నిగ్రహం(మనసు తప్ప), (ఇతరులకు హాని కలిగించే) దూషణ విడిచిపెట్టటం, ఇతరుల దుఃఖాలు సహించలేని తనం, సంసారిక విషయాల పట్ల వైరాగ్యం, సౌమ్యం గా ఉండటం (సజ్జనులు చేరటానికి వీలుగా), సిగ్గుపడటం (హానికరమైన కార్యకలాపాలలో పాల్గొనడం), తనకు అందుబాటులో ఉన్న విషయాల పై కూడా కోరిక లేకుండటం……

శ్లోకం 3

తేజః క్షమా దృతిః శౌచం అద్రోహో నాతిమానితా । భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత ॥

……. (దుష్టుల చేత) జయించ బడకుండా, ( దోషం తలపెట్టిన వారి పట్ల కూడా)సహనం తో, దృఢంగా ఉంటూ (కష్ట సమయాల్లో కూడా), శుభ్రతతో (మనస్సు, వాక్కు, శరీరం) ఉంటూ,(శాస్త్ర విధితమైనవి)కర్మలు చేస్తూ, ఇతరుల ధర్మ కార్యాలను ఇబ్బంది కలిగించక పోవటం, గర్వం లేకుండుట (ఈ గుణాల వల్ల), ఇవి దైవిక జన్ముల లో ఉండే గుణాలు, (భగవత్ ఆజ్ఞను పాటించేందుకు), ఓ భరత వంశస్థుడా!

శ్లోకం 4

దంభో దార్పోఽతిమానశ్చ క్రోధః పారుష్యం ఏవ చ । అజ్ఞానం చా అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం ॥

ఓ కుంతీ పుత్రుడా! ఎవరి వద్ద అయితే అసురీ సంపద ఉంటుందో అనగా, (భగవత్ ఆజ్ఞ అతిక్రమణ), ధర్మాన్ని (ధర్మపరులు అనే) కీర్తి కోసం అనుసరించటం, గర్వం(ఇంద్రియ సుఖాల ద్వారా పొందే), గొప్ప అహంకారం, (ఇతరులకు హానికరమైన) కోపం, (ధర్మాత్ములకు ఇబ్బంది కలిగించే) క్రూరత్వం మరియు (నిజాన్ని తెలుసుకునే విషయంలో అజ్ఞానం) , అనుసరించే, త్యజించే విషయం లో అవివేకత్వం ఉంటాయి.

వివరణం: ఈ శ్లోకం లో, అసురీ ప్రవృత్తి ఉన్నవారి గుణాలు వివరించారు.

శ్లోకం 5

దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీ మతా । మా శుచః సంపాదం దైవీం అభిజాతోఽసి పాండవ ॥

దైవీ సంపద (నా ఆజ్ఞ పాటించటం) వారిని సంసారం నుండి ముక్తులను చేస్తుంది; అసురీ సంపద (నా ఆజ్ఞను వ్యతిరేకించటం) వారికి నీచ స్థితిని అందిస్తుంది. ఓ పాండు కుమారుడా! నువ్వు (“నాకు అసుర జన్మ లభించిందా అని?”) చింతించకు. నువ్వు దేవజన్మ పొందావు దేవత సంపద పెంచటానికి.

వివరణం : అర్జునుడు తన స్వభావాన్ని ప్రశించుకుంటున్న అప్పుడు, కృష్ణుడు తన చింత దూరం చెయ్యటానికి అర్జునుడిది దేవ జన్మయే అని అభయం ఇస్తున్నాడు.

6వ శ్లోకం నుండి, దైవిక గుణాలు కర్మ, జ్ఞాన, భక్తి యోగాల్లో, విస్తృతంగా వివరించిన కారణం చేత, అసుర గుణాల గురించి విస్తారం గా వివరిస్తున్నాడు.

ఈ శ్లోకాల్లో, అసుర ప్రవృత్తి ఉన్నవారు ధర్మాన్ని, దైవాన్ని మరియు దైవిక గుణాలను విస్మరించటం మరియు స్త్రీ పురుషుల మధ్య ఉన్న వ్యామోహం పైనే ధ్యానించటం గురించి విస్తారంగా వివరించారు. వారు ఎల్లప్పుడూ సాంసారిక విషయాల గురించి కష్టపడటం, ఇంద్రియ సుఖాలే లక్ష్యం గా ఉండటం మరియు అధర్మం గా ధనం ఆర్జించటం చేస్తారు. వారు వారిని స్వతంత్రులుగా పరిగణించి వారి లక్ష్యాలు స్వయంగా సాధిస్తాము అనుకుని భ్రమిస్తారు. ఇలా వారు వారి మార్గం మధ్యలో ఓడిపోయి వారి పూర్వ కర్మల వల్ల నరకం లో పడతారు. వారికి గర్వం, తాము బలవంతులు, ఉదారులు అని. అహంకారం, మరియు కామ క్రోధ లోభాలు కలిగి ఉంటారు.

శ్లోకం 19

తాన్ అహం ద్విశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ । క్షిపామ్యజస్రం అశుభాన్ ఆశురీష్వేవ యోనిషు ॥

నా పట్ల ద్వేషం కలిగిన వారు, క్రూరమైన, నరాధములు, మరియు, అమంగళమైన వారిని, సంసారం (తిరిగి జన్మ, మరణ, వృద్ధాప్యం, రోగాల) లోకి నెట్టేస్తాను అందులోనూ అసురీ జన్మలోకి తోసేస్తాను.

వివరణం : ఈ శ్లోకం మరియు తర్వాత శ్లోకం లో, అసూరీ జన్మల వంటి వారు పొందే ఫలితాలు వివరించారు.

శ్లోకం 20

ఆసురీం యోనిం ఆపన్నా మూఢా జన్మని జన్మని । మామ్ అప్రాప్యయైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం ॥

ఓ కుంతీ పుత్రుడా! ఈ జనాలు, అసుర జన్మలు పొంది (గత శ్లోకం లో వివరించిన విధముగా), తర్వాత జన్మలల్లో, నా పట్ల ద్వేషం పెంచుకుని, నా గురించిన నిజమైన జ్ఞానం లేక, ఇంతకన్నా నీచమైన జన్మలు పొందుతారు.

21వ శ్లోకం లో, ఆత్మ నాశనం చేసే అసూరీ ప్రవృత్తి కి కారణం చెప్పబడింది.

22వ శ్లోకం లో, అసురీ ప్రవృత్తి విడిచిన వారికి కలిగే శుభాల పరంపర చెప్పబడింది.

శ్లోకం 23

యః శస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః । న స సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాం గతిం ॥

ఎవరు అయితే వేదల (ద్వారా నాచే) విదిత ఆజ్ఞలు అతిక్రమించి, వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తారో, వారు ఎటువంటి లక్ష్యం పొందరు. ఉదాహరణకు స్వర్గం లో జన్మించటం వంటివి. వాడు ఈ జన్మలో కూడా సంతోషం పొందడు. వాడు పరమ ప్రయోజనం (నన్ను పొందటం) కూడా సాధించలేడు.

శ్లోకం 24

తస్మాచ్ చాస్త్రం ప్రమాణం తే కార్యాకర్యవ్యవస్థితౌ । జ్ఞాత్వ శస్త్రవిధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి ॥

కావున, వేదాలు మాత్రమే ప్రామాణికం (కారణం ఇది జ్ఞానానికి మూలం కనుక) నీవు ఏది అనుసరించాలి ఏది త్యాజ్యం అని తెలుపటానికి. కావునా, శాస్త్రం లో వివరించబడిన (పరబ్రహ్మం యొక్క) నిజమైన తత్త్వం మరియు అతనిని పొందే సాధనం తెలుసుకొనటం చేత, నీవు విధించబడ్డ కార్యాలు చెయ్యటానికి (మరియు జ్ఞానానికి) అర్హత పొందుతావు. ఈ కర్మ భూమి (కర్మలు చెయ్యటానికి విధించిన ప్రదేశం).

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-16/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org