శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।।
ప్రతి పదార్థం
ధృష్టకేతుః – ధృష్టకేతువు అనే రాజు
చేకితానః – చేకితానుడు (మరొక రాజు)
వీర్యవాన్ – పరాక్రమము కలిగినవాడు
కాశీరాజః చ – కాశీ దేశ రాజు కూడా
పురుజిత్ – మరియు పురుజిత్తు అనే రాజు
కుంతిభోజః చ – మరియు కుంతిభోజుడు అనే రాజు
నరపుంగవః – పురుష శ్రేష్ఠుడు
శైబ్యః – శిబి చక్రవర్తి వంశానికి చెందినవాడు
తాత్పర్యం
ధృష్టకేతువు అనే రాజు, చేకితానుడు (మరొక రాజు), పరాక్రమము కలిగిన కాశీ దేశ రాజు, పురుజిత్తు మహారాజు, కుంతిభోజ మహారాజు, మరియు మానవులలో శ్రేష్ఠుడు అయిన శిబి చక్రవర్తి వంశానికి చెందిన శైబ్యుడు వీరంతా మహారథులు; (మహారథుడు అనేది గొప్ప యుద్ధ వీరులకు ఇచ్చే బిరుదు).
ఆముక్త రామానుజ దాసి
శ్రీ తేజ రామానుజ దాసి
మూలం: https://githa.koyil.org
పొందుపరచిన స్థానము- https://githa.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org