1.10 అపర్యాప్తం

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

అధ్యాయం 1

<< అధ్యాయం – 1 శ్లోకం – 9

శ్లోకం :

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ ।

పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ॥

ప్రతి పదార్థం

తత్ – ఈ ప్రకారముగా / ఈ విధంగా

భీష్మాభిరక్షితమ్ – భీష్మ పితామహుని చేత రక్షింపబడుతున్న

అస్మాకం బలం – మన సైన్య బలము

అపర్యాప్తం – అపారమైనది / వారి సైన్యాన్ని జయించుటకు పూర్తిగా సరిపోవునది (అజేయమైనది)

భీమాభిరక్షితమ్ – భీముని చేత రక్షింపబడుతున్న

ఇదమ్ ఏతేషాం బలం తు – కానీ, పాండవుల యొక్క ఈ సైన్యము

పర్యాప్తం – పరిమితమైనది / మన సైన్యాన్ని ఎదిరించుటకు సరిపోనిది

తాత్పర్యం

ఈ ప్రకారముగా, భీష్మ పితామహుని చేత రక్షింపబడుతున్న మన సైన్యము వారిని జయించుటకు అపారమైనదిగా (అజేయముగా) అనిపిస్తోంది; కానీ, భీముని చేత రక్షింపబడుతున్న పాండవుల ఆ సైన్యము మనలను జయించుటకు పరిమితమైనదిగానే (సులభంగా ఓడించదగినదిగానే) తోస్తోంది.

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

అధ్యాయం – 1 శ్లోకం – 11

మూలము : https://githa.koyil.org/index.php/1/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment