శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
తతః శ్వేతైర్ హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ .
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః
ప్రతి పదార్థం
తతః – తరువాత
మాధవః – శ్రీమహాలక్ష్మీ పతి కృష్ణుడు
పాండవః – పాండవుడు అర్జునుడు
శ్వేతైర్ హయైర్యుక్తే మహతి స్యందనే – తెల్ల గుర్రాలు లాగుతున్న మహా రథంలో
స్థితౌ – నిలిచి
దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః – దివ్యమైన శంఖాలను ఊదారు
తాత్పర్యం
తర్వాత, తెల్ల గుర్రాలు లాగుతున్న మహా రథంలో నిలిచిన మాధవుడు (కృష్ణుడు) మరియు పాండవుడు (అర్జునుడు) తమ దివ్యమైన శంఖాలను ఊదారు.
అడియేన్ లక్ష్మీ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org