శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
కృపయా పరయావిష్టో విషీదత్రిదమబ్రవీత్ ।
అర్జున ఉవాచ –
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ॥
ప్రతి పదార్థం
పరయా కృపయా ఆవిష్టః – తీవ్రమైన దయాభావావేశంతో కూడినవాడై
విషీదన్ – శోకిస్తూ / దుఃఖిస్తూ
ఇదమ్ అబ్రవీత్ – ఈ విధముగా పలికెను
అర్జున ఉవాచ – అర్జునుడు చెప్పెను
కృష్ణ – ఓ శ్రీకృష్ణా!
సముపస్థితమ్ – యుద్ధభూమిలో నిలిచియున్నట్టి
యుయుత్సుమ్ – యుద్ధం చేయగోరుతున్న
ఇమం స్వజనం దృష్ట్వా – ఎదుటనున్న ఈ స్వజనులను (బంధువులను) చూసి
తాత్పర్యం
తీవ్రమైన దయతో నిండిపోయి, దుఃఖిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికెను – ‘ఓ శ్రీ కృష్ణా! నాతో యుద్ధం చేయాలనే కోరికతో నా ఎదుట నిలిచియున్న నా స్వజనులను (బంధువులను) చూసి…’
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-28
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org