శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ||
ప్రతి పదార్థం
జనార్దన – హే జనార్దనా !
నిహత్య – వారిని చంపి
ధార్తరాష్ట్రాన్ – ధృతరాష్ట్రుని కుమారులను
న: – మనకు
కా ప్రీతిః స్యాత్ – ఏమి ఆనందం కలుగుతుంది?
ఆతతాయినః – చంపడానికి ప్రయత్నించేటటువంటి
ఏతాన్ – వీరిని
హత్వై – చంపడం వల్ల
అస్మాన్ – మనము
పాపం – పాపాన్నే
ఆశ్రయేత్ ఏవ – నిస్సందేహంగా మూటగట్టుకుంటాము
తాత్పర్యం
హే జనార్దనా ! ధృతరాష్ట్రుని కుమారులను చంపి మనకు ఏమి ఆనందం కలుగుతుంది? చంపడానికి ప్రయత్నించేటటువంటి వీరిని చంపడం వల్ల మనము పాపాన్నే నిస్సందేహంగా మూటగట్టుకుంటాము.
అడియేన్ ఆముక్త రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-36
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org