శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ||
ప్రతి పదార్థం
ఆచార్యాః – గురువులు
పితరః – పితృ సమానులు (తండ్రి వైపు బాబాయిలు, పెద్దనాన్నలు)
పుత్రాః – కుమారులు
తథా – అలాగే (అదే విధంగా)
పితామహాః – తాతలు
శ్వశురాః – మామగార్లు
పౌత్రాః – మనవళ్లు
శ్యాలాః – బావమరుదులు
తథా సంబంధినః – మరియు సమస్త బంధువులు
తాత్పర్యం
గురువులు, పితృ సమానులు (తండ్రి వైపు బాబాయిలు, పెద్దనాన్నలు), కుమారులు (సోదరుల కుమారులు కూడా), అలాగే తాతలు, మామగార్లు, మనవళ్లు, బావమరుదులు మరియు సమస్త బంధువులు ఇక్కడ (యుద్ధభూమిలో) ఉన్నారు.
అడియేన్ ఆముక్త రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-34
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org