శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।।
ప్రతి పదార్థం
సంజయ – ఓ సంజయా!
ధర్మక్షేత్రే కురుక్షేత్రే – ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో
యుయుత్సవః – యుద్ధం చేయాలనే కోరికతో
సమవేతా – సమూహముగా ఒకచోట చేరిన
మామకాః – నా కుమారులు
పాండవాః చ ఏవ – మరియు పాండు కుమారులు
కిమ్ అకుర్వత – ఏమి చేశారు?
ధృతరాష్ట్రః ఉవాచ – ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికెను
తాత్పర్యం
ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికెను – ఓ సంజయా! పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో ఒకచోట చేరిన నా కుమారులు మరియు పాండు రాజు కుమారులు ఏమి చేశారు?
ఆముక్త రామానుజ దాసి
శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org