1.12 తస్య సంజనయన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 11

శ్లోకం

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః .

సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ .. 

ప్రతి పదార్థం

ప్రతాపవాన్ – మహా శూరుడు

కురువృద్ధః పితామహః – కురు వంశంలో వృద్ధుడు, పితామహుడు భీష్ముడు

తస్య – దుర్యోధనునికి

హర్షం సంజనయన్ – ఆనందం కలిగించేందుకు

ఉచ్చైః సింహనాదం వినద్య – సింహంలా గర్జిస్తూ

శంఖం దధ్మౌ – శంఖాన్ని ఊదాడు

తాత్పర్యం

కురు వంశంలోని వృద్ధుడు, మహా శూరుడు భీష్ముడు, దుర్యోధనునికి ఆనందం కలిగించేందుకు, సింహంలా గర్జిస్తూ, తన శంఖాన్ని బిగ్గరగా పూరించాడు (ఊదాడు).

అడియేన్ లక్ష్మీ రామానుజ దాసి

>> అధ్యాయం 1 శ్లోకం 13

మూలము : https://githa.koyil.org/index.php/1-12/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.orgCategories