1.16 – అనంతవిజయం

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 15

శ్లోకం

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః

నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ

ప్రతి పదార్థం

కుంతీపుత్రః  – కుంతీ యొక్క పుత్రుడు

రాజా  – మరియు రాజు

యుధిష్ఠిరః – ధర్మపుత్రుడు

అనంతవిజయం – ‘అనంతవిజయం’ అను శంఖమును పూరించెను

నకులః సహదేవశ్చ  – (మాద్రీ పుత్రులైన) నకులుడు మరియు సహదేవుడు

సుఘోషమణిపుష్పకౌ  – వరుసగా ‘సుఘోషము’, ‘మణిపుష్పకము’ అను శంఖములను పూరించిరి

తాత్పర్యం

కుంతీ పుత్రుడూ మరియు రాజూ అయిన ధర్మపుత్ర యుధిష్ఠిరుడు ‘అనంతవిజయం’ అనే శంఖాన్ని పూరించాడు. మాద్రీ పుత్రులైన నకులుడు, సహదేవుడు వరుసగా ‘సుఘోషం’, ‘మణిపుష్పకం’ అనే తమ శంఖాలను పూరించారు.

>> అధ్యాయం 1 శ్లోకం 17

మూలము : https://githa.koyil.org/index.php/1-16/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment